సంజూ శాంసన్ బాగా ఆడతాడు అనుకున్నప్పటికీ భారత జట్టులో మాత్రం ఎక్కువగా స్థానం సంపాదించలేక పోయాడు. దీనికి ఒకటే కారణం నిలకడ లేమి అంటూ ఉంటారు విశ్లేషకులు. ఏదో ఒక మ్యాచ్లో బాగా రాణించి భారీగా పరుగులు చేస్తాడు తప్ప అన్ని మ్యాచ్ లలోను అదే పామ్ కొనసాగించ లేడు అన్న కారణంగా భారత జట్టులో సంజూ శాంసన్ ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేదు. ఇక సంజు శాంసన్ కి భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఐపీఎల్ ద్వారా మంచి అవకాశం దొరికింది అని చెప్పాలి. ఇక రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టులో స్థానం ఖాయం అని అనుకున్నారు అందరు.
అంతేకాదు సంజు శాంసన్ ఫ్యూచర్ స్టార్ అని అనుకున్నారు. కానీ సంజు శాంసన్ మాత్రం మళ్ళీ పాత సీన్ రిపీట్ చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడిన రెండు మూడు మ్యాచ్ లలో అద్భుతంగా రాణించి భారీ బౌండరీలు బాదుతూ ఎంతో మందిని ఆకర్షించిన సంజూ శాంసన్.. ఆ తర్వాత మ్యాచ్ లో మాత్రం అదే ఫామ్ కొనసాగించలేక సతమతమవుతున్నాడు. కేవలం రెండు డిజిట్స్ ఆరు పరుగులు చేయడానికి కూడా ఎంతో కష్టపడి పోతున్నాడు. చివరికి అనవసరమైన షార్ట్స్ ఆడుతూ పెవిలియన్ బాట పడుతున్నారు. ప్రారంభంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ ఇప్పుడు మాత్రం.. జట్టు ఓటమికి కారణం అవుతాడు అని చెప్పాలి. గతంలో ఉన్న టాక్ ని మరోసారి నిజం చేస్తున్నాడు.