దీంతో ప్రతి సీజన్లో బెంగళూరు జట్టు టైటిల్ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న అభిమానులందరికీ నిరాశే ఎదురవుతుంది. ఈసారి మాత్రం జట్టు మునుపటిలా కనిపించడం లేదు. ఎంతో సమతూకం తో వరుస విజయాలు అందుకుంటూ పాయింట్ల పట్టిక లో మెరుగైన స్థానాన్ని సంపాదించుకుంటుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో పటిష్టం గా కనిపిస్తూ అభిమానుల ఆశలు నెరవేర్చే లాగే కనిపిస్తుంది. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఈ సీజన్లో కీలక ఆటగాడిగా ఉన్న యుజ్వేంద్ర చాహల్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.
ప్రతి మ్యాచ్లో కూడా కీలక వికెట్లు పడగొడుతూ తన స్పిన్ మాయాజాలంతో అందర్నీ ఆశ్చర్య పరుస్తూ నే ఉన్నాడు. దీంతో చాహల్ బౌలింగ్ పై ఎన్నో ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. చాహల్ బౌలింగ్ పై స్పందించిన భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. నీ బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు కనీసం రన్స్ కొట్టే అవకాశం కూడా ఇవ్వడం లేదు.. కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ మెయిడెడ్ వేసి ఆకట్టుకున్నాయి... ప్రస్తుతం నీ బౌలింగ్ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.