ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న విషయం తెలిసిందే. చివరి బాల్  వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో అన్నది ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది. ప్రేక్షకులు లేకుండా ఈ ఏడాది ఐపీఎల్ సాదాసీదాగా జరుగుతుంది అని ప్రేక్షకులు భావించినప్పటికీ... చివరికి మునుపెన్నడూ లేనంతగా ఈ ఐపీఎల్ సీజన్ అద్భుతంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది. ఎందుకంటే దిగ్గజజట్లు సైతం ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తూ ఉంటే ఎలాంటి అంచనాలు  సైతం లేని జట్లు  అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకులకు అంచనాలను తారుమారు చేస్తూ ఆశ్చర్య పరుస్తూనే ఉన్నాయి.



 అయితే నిన్న ఐపీఎల్ పోరులో భాగంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శనతో పడుతూ లేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. చివరి బాల్ వరకు  మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ చివరికి మ్యాచ్  చివరి ఓవర్లోనే  ఢిల్లీ వైపు వెళ్లి ఢిల్లీ మంచి విజయాన్ని సాధించింది. చివరి ఓవర్లో జడేజా బౌలింగ్ చేయగా అక్షర్ పటేల్ సిక్సుల వర్షం కురిపించి ఎంతో సునాయాసంగా ఢిల్లీ జట్టుకు  విజయం వరించేలా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ మరోసారి విజయం సాధించి అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది.



 ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరోసారి నిరాశ తప్పలేదు... అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టిన అక్షర్ పటేల్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉండగా గతంలో ఉన్న లెక్కను అక్షర్ పటేల్ నిన్నటి మ్యాచ్  తో సరి చేసాడు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2016 ఐపీఎల్ సీజన్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేసిన సమయంలో 6 బాళ్లలో 23 పరుగులు చేసిన ధోని పూణే జట్టును గెలిపించాడు. ఇక ఇప్పుడు ధోనీ సారథ్యంలోని సిఎస్కె జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి అక్షర్ పటేల్ ఓడించాడు. దీంతో ప్రస్తుతం అక్షర్ పటేల్ ధోని లెక్కను  సరి చేశాడు అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: