నేడు ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు మ్యాచ్లలో విజయం సాధించింది... ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. అయితే ప్లే ఆఫ్ ఆశయాలను ఇంకా సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లు తప్పక విజయం సాధించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎవరి వ్యూహాలు నేడు జరగబోయే మ్యాచ్ లో ఫలిస్తాయి అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.
అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు ఏడు స్థానాలలో కొనసాగుతున్నాయి ఈ రెండు జట్లు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో గెలిచిన జట్టు కి పాయింట్ల పట్టికలో స్థానం మెరుగుపడే అవకాశం ఉందని. అయితే మొదటి నుంచి పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ రెండు జట్లూ బాటింగ్ పరంగా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు కాస్త బలంగా ఉంది అని చెప్పాలి. బౌలింగ్ విభాగంలో చూసుకుంటే... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉండగా చివరికి ఎవరు గెలుస్తారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంది. చూడాలి మరి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయ ఢంకా మోగించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటారో అన్నది.