ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలోనే నాలుగుసార్లు టైటిల్ గెలిచి దిగ్గజ జట్టు గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది కూడా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మొదట ఓటమితో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా విజయాలను అందుకుంటూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇక దిగ్గజ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టులో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా పాత్ర ఎంతో కీలకం అని చెప్పాలి. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టుకు విజయం అందించడంలో ఎప్పుడు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. కేవలం ఐపీఎల్ లోనే కాదు భారత జట్టులో కూడా ప్రస్తుతం కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే ముంబై ఇండియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరిపోయాడు జస్ప్రిత్ బూమ్రా. అంతేకాకుండా టి20 క్రికెట్ లో 200 వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్గా కూడా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. అయితే నిన్నటి మ్యాచ్ లో బుమ్రా పడగొట్టిన 100వ వికెట్ విరాట్ కోహ్లీ ది కావడం గమనార్హం.