ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించింది  అనే విషయం తెలిసిందే. ఎందుకంటే కరోనా  వైరస్ కారణంగా దాదాపు అన్ని రకాల క్రీడలు నిలిచిపోయిన నేపథ్యంలో క్రికెట్ ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దాదాపు ఏడు నెలల పాటు ఎక్కడ కూడా క్రికెట్ మ్యాచ్లు జరగకపోవడంతో క్రికెట్ ప్రేక్షకులందరికీ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కరువైంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ ప్రారంభం అవుతుంది అని పలుమార్లు ప్రకటనలు వచ్చినప్పటికీ క్రమక్రమంగా ఐపీఎల్ వాయిదాపడుతూ వచ్చింది కానీ ఎట్టకేలకు యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే.



 ఇక యూఏఈ వేదికగా జరిగినప్పటికీ క్రికెట్ అభిమానులు అందరికి  ఐపీఎల్ ఫుల్ టైమ్  ఎంటర్టైన్మెంట్ అందించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సాధారణంగానే ఐపీఎల్ టోర్నీ అంటే చాలు యువ ఆటగాళ్లకు అందరికీ భారత జట్టులో స్థానం సంపాదించేందుకు ఒక మంచి అవకాశం అన్న  విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో ఎంతో మంది యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందరు యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన తో ఇరగదీశారు. క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు సైతం అందుకున్నారు ఐపీఎల్ సీజన్లో యువ ఆటగాళ్ళు.




 ఐపీఎల్ సీజన్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటి తమని తాము నిరూపించుకున్నారు. ఋతురాగ్  గైక్వాడ్,  పడిక్కాల్ , సూర్యకుమార్ యాదవ్, ఇషాన్  కిషన్ లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ సూపర్ స్టార్ లుగా మారిపోయిన విషయం తెలిసిందే. తమ ప్రతిభను చాటుకున్నారు. ఇక  ముంబై  ఇండియన్స్ జట్టులో ఆడుతున్న ఇషాన్ కిషన్  ప్రతి మ్యాచ్లో కూడా విజయంలో కీలకపాత్ర వహిస్తూ... అద్భుతంగా రాణించాడు. చూడడానికి చిన్న పిల్లాడిలా కనిపించే 22 ఏళ్ల ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా  దూసుకుపోయాడు. అంతేకాదు ఏకంగా ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా కూడా ఇషాన్ కిషన్ నిలిచాడు. తర్వాత 26 సిక్సర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు సంజూ  శాంసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: