భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించిన సురేష్ రైనా ఆగస్టు 15వ తేదీన మహేంద్ర సింగ్ ధోనీతో పాటు తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  దీంతో అభిమానులందరికీ భారీ షాక్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇన్ని రోజుల వరకు ధోనితోనే నడిచాను ఇక ఇప్పుడు కూడా ధోనీ తోనే అంతర్జాతీయ క్రికెట్ ముగిస్తున్నాను అంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.  అయితే గతంలో సురేష్ రైనా మిడిలార్డర్లో ఎంతో సమతూకమైన  బ్యాట్మెన్గా టీమిండియాలో ఎన్నో రోజుల పాటు సేవలు అందించాడు అన్న విషయం తెలిసిందే.



 ఆ తర్వాత యు ఆటగాళ్ల జోరు పెరగడంతో సురేష్ రైనా ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ కూడా తనకు భారత జట్టులో స్థానం దక్కలేదు. దీంతో భారత జట్టులో స్థానం కోసం ఎంతగానో నిరీక్షణ ఎదురుచూశాడు సురేష్ రైనా.  ఇక ఇటీవల ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి కూడా నిష్క్రమించి అభిమానులకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కుటుంబ సమస్యల నేపథ్యంలో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి ఈ  ఐపీఎల్ సీజన్ లో నిష్క్రమించాను  అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం టీమిండియా జట్టు కీలక సూచనలు చేశాడు సురేష్ రైనా. జట్టులో ఉన్న బ్యాట్ మెన్స్  బౌలింగ్ చేయడం ఎంతో మంచిది అంటూ చెప్పుకొచ్చాడు.



 భారత జట్టు లో బ్యాట్స్మెన్లు అప్పుడప్పుడు బౌలింగ్ చేసి వికెట్లు తీయగలిగితే జట్టు ఎంతో సమతూకంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా. కానీ ప్రస్తుతం ఉన్న భారత జట్టులో మాత్రం అలాంటి సేవలు అందడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కీలక సమయంలో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడం ఇక బౌలర్లు అవసరమైనప్పుడు బ్యాటింగ్ చేయడం వల్ల జట్టు క్లిష్ట సమయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తుందని ఇది ఎంతో కీలకం అంటూ చెప్పుకొచ్చాడు గతంలో భారత క్రికెట్ లో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్లు బౌలింగ్ లో కూడా వికెట్లు తీయగా యువరాజ్ సింగ్ కూడా పార్ట్ టైం బౌలర్గా రాణించాడు అంటూ గుర్తు చేశారు సురేష్ రైనా.

మరింత సమాచారం తెలుసుకోండి: