నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఎన్నో రోజుల తర్వాత దిగ్గజ జట్లుగా ఉన్న భారత ఆస్ట్రేలియా మధ్య తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ మ్యాచ్లో ఏ జట్టు ఎలా ఆడుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది ఈ క్రమంలోనే అటు భారత్ ఆస్ట్రేలియా అభిమానులతో పాటు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్ లైవ్ లో వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.


 అంతేకాదు ఈ మ్యాచ్ ప్రస్తుతం పింక్ బాల్ తో జరుగుతూ ఉండటం కూడా ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.  కాగా ఇప్పటికే వన్డే టి20 సిరీస్ లు ఆడిన భారత్ ఆస్ట్రేలియా జట్లు చెరొక సిరీస్ కైవసం చేసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇరు జట్లు కూడా ప్రస్తుతం ఆయా సిరీస్ లలో  వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే నేడు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.



 అయితే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఏకంగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మ్యాచ్  ఏకంగా 120 దేశాలలో లైవ్గా ప్రసారం కానుంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ ఇన్ని దేశాలలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. ప్రస్తుతం దిగ్గజ టీములుగా కొనసాగుతున్న రెండు జట్ల మధ్య జరగబోయే సమరాన్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం తో పాటు ప్రేక్షకులు అందరికీ మరింత ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఇంగ్లీష్ తమిళం తెలుగు భాషలలో కూడా కామెంటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: