ఐపీఎల్ టోర్నీ వచ్చిందంటే చాలు ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ జట్టులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎప్పుడు ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టార్ బ్యాట్మెన్స్  లేకపోయినప్పటికీ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో అద్భుతంగా రాణిస్తూ తమ ఆట తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఐపీఎల్లో విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతుంది.



 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్గా మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న కేన్  విలియంసన్ ఇక సన్రైజర్స్ హైదరాబాద్ లో కూడా తన ఆటతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో తన బ్యాట్ కి  పని చెప్పి ఎంతో అద్భుతంగా ఆడుతూ ఉంటాడు. ఇక జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న కేన్ విలియమ్సన్ వచ్చే  ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది అంటూ టాక్ వినిపించింది.



 ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులందరూ అయోమయంలో మునిగిపోయారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న కేన్ విలియమ్సన్ నిజంగానే సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి వచ్చే ఐపీఎల్ సీజన్ లో దూరం కానున్నాడా  అనే అయోమయానికి ఇటీవల తెరపడింది. ఇటీవలే ఈ విషయంపై స్పందించిన జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కేన్ విలియమ్సన్ ఎక్కడికి వెళ్ళడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. తమ వద్దకు ఇలాంటి టాక్ మొదటిసారి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: