మొదటి టెస్టులో ఓపెనర్గా బరిలోకి దిగిన పృద్వి షా అధరగొడతాడు అనుకుంటే దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో అతనిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించినప్పటికీ టెస్ట్ మ్యాచ్లో మాత్రం నిరాశ పరిచాడు అని చెప్పాలి. రెండు టెస్ట్ మ్యాచ్లలో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే మూడో టెస్టులో ఎవరిని ఓపెనర్గా దింపాలి అనేదానిపై ప్రస్తుతం టీమిండియా యాజమాన్యం దృష్టిసారించింది అని అర్థమవుతుంది. ప్రస్తుతం మూడో టెస్టులో రోహిత్ శర్మ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో రోహిత్ కు జోడి ఎవరు రాబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే మయాంక్ అగర్వాల్ రోహిత్ శర్మ కు జోడిగా మరోసారి అవకాశం ఇవ్వాలని సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఒకవేళ అగర్వాల్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. మయాంక్ అగర్వాల్ జట్టులో కొనసాగిస్తే హనుమ విహారి పై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గిల్ ను మిడిల్ ఆర్డర్ కు పంపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే జట్టు లో ఎవరు ఉంటారు ఎవరి పై వేటు పడుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి అంటే జనవరి 6 వరకు వేచి చూడాల్సిందే.