ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే..  ఐపీఎల్ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా బయలుదేరిన భారత జట్టు అక్కడ 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆస్ట్రేలియా జట్టుతో మూడు ఫార్మాట్ల సిరీస్ లలో  తలబడుతుంది. ఇప్పటికే వన్డే టి20 సిరీస్ ఆడిన భారత జట్టు.. ఒక సిరీస్ చేజార్చుకున్నప్పటికీ ఒక సిరీస్ కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్  సిరీస్ ఆడుతున్న భారత జట్టు.  ఆస్ట్రేలియా గడ్డపై మొదటిసారి పింక్ బాల్ తో డే అండ్ నైట్ టెస్ట్ ఆడుతుంది భారత జట్టు.



 టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు ఆధిక్యంలో కొనసాగింది అనిపించినప్పటికీ మొదటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో  ఘోరంగా విఫలం కావడంతో చివరకు మునుపెన్నడూ లేనివిధంగా ఓటమిని చవిచూసింది అన్న విషయం తెలిసిందే.  అయితే తర్వాత విరాట్ కోహ్లీ తన సతీమణి ప్రసవం ఉన్న కారణంగా భారత్ తిరిగి వచ్చాడు.  దీంతో టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో రాణించడం చాలా కష్టం అని  అనుకున్నారు. అందరు కానీ ఊహకందని విధంగా టీమిండియా జట్టు ఎంతగానో పుంజుకుంది అన్న విషయం తెలిసిందే.


 రహానే అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడటంతో ఘన విజయం సాధించింది టీమిండియా. అయితే జనవరి 7వ తేదీన భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. అయితే టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ పై ఇటీవలే పాకిస్తాన్ మాజీ పేసర్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  మొదటి మ్యాచ్లో ఘోర ఓటమి చవి చూసినప్పటికీ రెండో మ్యాచ్లో టీమిండియా పుంజుకుందని.. ఇక సిరీస్ టీమిండియా కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.  ఆస్ట్రేలియా జట్టుపై పాకిస్తాన్  టీమిండియా జట్లు  ఆధిపత్యం చెలాయిస్థాయి అని అనుకున్నాము  అదే జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించాడు పాకిస్థాన్ మాజీ పేసర్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి: