ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ లో తలపడుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టుతో వన్డే టి20 సిరీస్ లు  ఆడిన భారత జట్టు ఒక సిరీస్ చేజార్చుకుని  ఒక సిరీస్ మాత్రం కైవసం చేసుకుంది.  అయితే ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఘోరంగా విఫలమైన భారత జట్టు ఘోర ఓటమి చవిచూసింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో మ్యాచ్ లో  అనూహ్యంగా పుంజుకున్న భారతజట్టు కంగారులకు కంగారు పుట్టించింది.  అద్భుతమైన ప్రదర్శన తో ఘన విజయాన్ని అందుకుంది భారత జట్టు.



 టెస్ట్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఒక మ్యాచ్ గెలవగా టీమిండియా జట్టు ఒక మ్యాచ్ గెలిచింది. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీన జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.  అయితే ప్రస్తుతం టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులోకి చేరాడు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టును వేధిస్తున్న ఓపెనింగ్ సమస్య రోహిత్ శర్మ రాకతో తీరిపోనుంది అని అటు విశ్లేషకులు భావిస్తున్నారు. అటు  ఆస్ట్రేలియా జట్టులో కూడా ఓపెనింగ్ జోడి నిరాశపరుస్తుంది.



 ఇక ఈ క్రమంలోనే మూడో టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను జట్టులోకి  తీసుకుంది ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం.  అయితే ఇక రెండో టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా మూడో టెస్ట్ కోసం ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇకపోతే గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డేవిడ్ వార్నర్ ని జట్టులోకి  తీసుకున్న ఆస్ట్రేలియా.. అతను 100% పూర్తిగా పెద్దగా లేకపోయినప్పటికీ జట్టులో అతను ఉండాలని భావిస్తోందట. కొంతకాలం నుంచి పూర్తిగా ఓపెనింగ్ జోడి విఫలమౌతుండడంతో వార్నర్ లేకపోతే భారత బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా జట్టు యజమాని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: