భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.  భారత క్రికెట్ లో ని ప్రతీ అంశంపై స్పందిస్తూ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.  ఇక వీరేంద్ర సెహ్వాగ్ చేసే  పోస్టులు అందరినీ నవ్విస్తూ ఉంటాయి. ఇటీవలే మరో సారిఒక ఫన్నీ పోస్ట్ పెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్.  ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతుంది. ఇప్పటికి మూడు టెస్ట్ మ్యాచ్ లు  పూర్తి చేసుకున్న భారత జట్టు నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దం అవుతుంది.


 ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టులోని కీలక ఆటగాళ్లు అందరూ వరుసగా గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూ ఉండడం టీమిండియా జట్టును వేధిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో ఇప్పటివరకు ఏకంగా 13 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. సిడ్ని  మైదానంలో రిషబ్ పంత్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బూమ్రా కు గాయాలు అయిన సంగతి తెలిసిందే.  అయితే వీరిలో జస్ప్రిత్ బూమ్రా,హనుమ విహారి, రవీంద్ర జడేజాలు ఇప్పటికే నాలుగవ టెస్టుకు దూరమైనట్లు అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ.



 రవిచంద్రన్ అశ్విన్,  రిషబ్ పంత్ ఫిట్నెస్ పై ఇంకా స్పష్టత లేదు.  అదే సమయంలో షమీ, ఉమేష్ యాదవ్,  కేఎల్ రాహుల్ కూడా అంతకు ముందు గాయాల బారినపడి టెస్టు జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయంపై ఆసక్తి కర పోస్టు పెట్టాడు.  నాలుగో టెస్ట్ కు  11 మంది లేకపోతే చెప్పండి. చెట్లు పెరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను..  క్వారంటైన్ నిబంధనల గురించి తర్వాత ఆలోచిద్దాం అంటూ సరదాగా ఒక పోస్ట్ పెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుత ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: