ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికే టి20, వన్డే సిరీస్ లు  ఆడిన భారత జట్టు.. అటు టెస్టు సిరీస్ తో  కూడా ఆస్ట్రేలియా జట్టుతో హోరాహోరీగా తలపడుతూ  ఉంది. ఈ క్రమంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా ఇక ఆ తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా జట్టు విజయం సాధించింది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారో  అని అందరూ ఎంతగానో ఎదురుచూశారు. కానీ ఊహించని విధంగా మూడవ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.



 భారత ఆటగాళ్లు విరోచిత పోరాటం చేయడంతో ఓడిపోవాల్సిన టెస్ట్ మ్యాచ్ కాస్తా డ్రాగా ముగిసింది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఆస్ట్రేలియా జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.  భారత బౌలర్లు ఎంతో దూకుడుగా బౌలింగ్ చేస్తున్నారు.  ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై భారత ఆటగాళ్లు ఇద్దరిని ఒక రికార్డు ఊరిస్తోంది.



 ఆస్ట్రేలియా గడ్డపై వెయ్యి పరుగుల మైలురాయిని అందుకునేందుకు పూజారా, రహానే చేరువలో ఉన్నారు.  ఈ క్రమంలోనే నేడు జరుగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ లో ఎవరు ఈ అరుదైన రికార్డు సాధిస్తారు అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుజారా 88 రన్స్, అజింక్య రహానే 177 రన్స్ దూరంలో 1000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.


 ఇకపోతే నేడు  నాలుగో టెస్టులో తలపడుతున్న ఇరు జట్లు ఇలా ఉన్నాయి. టీమిండియా జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, మహ్మద్‌ సిరాజ్‌, టి. నటరాజన్‌.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ హారిస్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, టిమ్‌ పెయిన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయన్‌, జాష్‌ హేజిల్‌వుడ్‌

మరింత సమాచారం తెలుసుకోండి: