ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వేసిన బౌలింగ్లో స్క్వేర్ దిశగా ఫుల్ చేశాడు మార్కస్ లబుషేన్. ఈ క్రమంలోనే సింగిల్ కోసం పరుగు పెట్టాడు. అప్పుడే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి వచ్చిన పృథ్వీ షా.. బంతి అందుకుని రనౌట్ కోసం వేగంగా బంతిని త్రో చేశాడు. కానీ పృథ్వీ షా త్రో చేసిన తర్వాత అది కాస్త గురితప్పి రోహిత్ శర్మ చేతిని తాకింది. ఇక ఈ సన్నివేశం తో పాటు మ్యాచ్ కామెంట్ థియేటర్లు పకపకా నవ్వారు.. రోహిత్ శర్మ చాలా సీరియస్ గా కనిపించాడు.
అయితే బాల్ గట్టిగా తగలడంతో అటు రోహిత్ శర్మ చేతికి గాయం కూడా అయినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పృథ్వీ షా పై కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఫీల్డింగ్ చేసే ముందు కనీసం ఆ మాత్రం చూసుకోవా అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.. వాస్తవానికి అక్కడ పృథ్వీ షా తప్పు లేదని.. అతడు రనౌట్ చేయాలనే ఆలోచనతోనే.. త్రో విసిరాడని.. ఆ సమయంలో రోహిత్ శర్మ అడ్డుగా నిలబడి పోవడంతో బంతి నేరుగా వెళ్లి అతని చేతిని తాకింది అంటూ మరికొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు.