ప్రస్తుతం భారత క్రికెట్లో యువ ఆటగాడు నటరాజన్ పేరు మార్మోగిపోతోంది అన్న విషయం తెలిసిందే.  అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటూ ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ చూపును తనవైపు తిప్పుకున్నాడు నటరాజన్.  ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన నటరాజన్  ఆ తర్వాత బీసీసీఐ సెలెక్టర్స్  చూపును ఆకర్షించి భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలాగ  ప్రస్తుతం నటరాజన్ అద్భుతంగా దూసుకుపోతున్నాడు.



 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టి20 సిరీస్ కోసం ఎంపికైన నటరాజన్ కొత్త ఆటగాడు కాబట్టి కేవలం బెంచె స్ట్రెంత్ కి  మాత్రమే పరిమితం అవుతాడు అని అనుకున్నారు అందరు. కానీ టీమిండియా జట్టులో ని బౌలర్ గాయపడటంతో జట్టులోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని కీలక వికెట్లు పడగొట్టడంతో  అటు తర్వాత మ్యాచ్ లలో  కూడా నటరాజన్ ను  కొనసాగించారు.ఇక ఆ తర్వాత అతని ప్రతిభ తో వన్డే సిరీస్ లో కూడా స్థానం దక్కించుకున్నాడు నటరాజన్. ఇక వన్డే సిరీస్ లో కూడా అదరగొట్టాడు అని చెప్పాలి.



 ఇక టి20 వన్డే సిరీస్ లు  పూర్తయినప్పటికీ  బీసీసీఐ  మాత్రం నటరాజన్ ను ఇంటికి పంపలేదు.  ఆస్ట్రేలియాలోని ఉంచుకున్నది. ఇటీవలే టెస్ట్ సిరీస్ ఆడుతున్న భారత జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో అవకాశం దక్కించుకున్న నటరాజన్  మరోసారి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇటీవల భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా ఏం కోరుకుంటుందో దానికి నటరాజన్ న్యాయం చేస్తున్నాడు అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. సైని  గాయంతో జట్టుకు దూరమైనప్పటికీ ఆ బాధ్యత తీసుకొని నటరాజన్ ప్రత్యర్థులపై ఎంతో ఒత్తిడి తీసుకోవచ్చి  కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు అని నటరాజన్  కు మంచి భవిష్యత్తు ఉంది అంటూ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: