సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ఇక భారత క్రికెట్లో అద్భుతంగా రాణిస్తే అంతకంటే సంతోషం ఇంకేముంది అని సంబర పడిపోయారు అభిమానులు. కానీ మొదటి నుంచి అర్జున్ టెండూల్కర్ అభిమానుల అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే ఇకపోతే ఇటీవలే ఐపీఎల్ కోసం అర్జున్ టెండూల్కర్ దరఖాస్తు చేసుకున్నాడు. ఒకవేళ ఎంపిక అయితే అభిమానులందరికీ అసలు సిసలైన ఆట చూసేందుకు అవకాశం వస్తుంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇటీవలే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అర్జున్ టెండూల్కర్ అభిమానులను ఆనందంలో ముంచేశాడు.
ఇటీవలే ముంబై వేదికగా జరిగిన 73వ పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ లో అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నాడు అర్జున్ టెండూల్కర్. ఇస్లాం జింఖానా తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 31 బంతుల్లో 77 పరుగులు చేయడమే కాదు కీలక సమయంలో మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. స్పిన్నర్ హషీర్ వేసిన బౌలింగ్ లో ఏకంగా వరుసగా ఐదు సిక్సర్లు బాది అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ క్రమంలోనే ఐదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో ఏకంగా 31 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అదే సమయంలో జట్టుకు విజయం అందించడంలో అర్జున్ టెండూల్కర్ కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా రాణించడంతో అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.