ఇక కొన్ని కొన్ని సార్లు మైదానంలో ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలుమార్లు వాగ్వాదానికి దిగిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఎప్పుడూ మైదానంలో దూకుడుగా వ్యవహరించే విరాట్ కోహ్లీ కి ఇక ఇప్పుడు దూకుడు స్వభావమే కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. ఏకంగా విరాట్ కోహ్లీ సస్పెన్షన్ కు గురయ్యే పరిస్థితులు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు ఇక రెండవ కేసులో అద్భుతంగా పుంజుకొని ఇంగ్లాండ్ జట్టు పై అదిరిపోయేలా ప్రతీకారం తీర్చుకుంది.
అయితే ఇంగ్లండ్ తో రెండవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ల తో వాగ్వాదానికి దిగటం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే కోహ్లీ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జో రూట్ క్యాచ్ విషయంలో ఇటీవలే మైదానంలో ఫీడ్ అంపైర్ లతో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ తప్పును లెవెల్ వన్ లెవెల్ టు గా పరిగణించి.. కోహ్లీ పై సస్పెన్షన్ వేటు వేసే అవకాశంఉంది అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి తప్పులు చేసిన ఆటగాళ్లకు ఒకటి నుంచి నాలుగు డిమెరిట్స్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. అదే జరిగితే ఇక ఇప్పటికే కోహ్లీ ఇక ఇప్పుడు వివాదంతో ఏకంగా కోహ్లీ ఒక టెస్ట్ మ్యాచ్ సస్పెన్షన్ కు గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.