క్రికెట్ క్రికెట్ క్రికెట్.. త్వరలోనే ఐపీఎల్ మొదలవబోతోంది .. ఇక ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ మొదలవుతుంది .. అంటే ఎంతగా క్రికెట్ ను ఇష్టపడతారు అర్థం అవుతోంది కదా..! అయితే క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికీ తెలిసిన ఆటే. చిన్నా,పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా  భారత్ లో మహిళల జట్టు అందర్నీ ఆకర్షిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి అనంరతం మెల్లమెల్లగా అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల జట్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధమవుతున్నాయి. మార్చి నెలలో దక్షిణాఫ్రికా జట్టుతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు భారత మహిళల జట్టును బిసిసిఐ ప్రకటించింది.

కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం మెల్లమెల్లగా క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. మార్చి 7 నుంచి లఖన్ ఫూ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 5 వన్డేలు, 3 టీ 20 మ్యాచ్ లు జరగనున్నాయని బీ సీ సీ ఐ ప్రకటించింది. అంతేకాకుండా వన్డే సిరీస్ కు మిథాలీ రాజ్, టి20 సిరీస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ లు కెప్టెన్ లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. వికెట్ కీపర్ గా శ్వేతా వర్మ వన్డే సిరీస్ తో అరంగేట్రం చేయనుంది.


వన్డే జట్టు : మిథాలీ రాజ్ ( కెప్టెన్ ), స్మృతి మంధాన,జెమియా , పూనమ్ రౌత్, హర్మాన్ కౌర్, ప్రియా పునియా, ఎస్తికా భాటియా, సుష్మా వర్మ  ( వికెట్ కీపర్ ), హేమలత, దీప్తి వర్మ, శ్వేత వర్మ  ( వికెట్ కీపర్ ),  రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, జిలాన్ గోస్వామి, మున్నీ జోషి,  మోనిక పటేల్, ప్రత్యూష.

టీ 20 డేట్ : హర్మన్ కౌర్ ( కెప్టెన్ ), స్మృతి మంధాన, షఫాలి, సుష్మా వర్మ (వికెట్ కీపర్ ), రిచా గోస్, హర్లీన్,పర్వీన్ (వికెట్ కీపర్), దీప్తి వర్మ, అయూషి సోని,  అరుంధతి, రాధా యాదవ్,  రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మున్నీ జోషి, మోనిక పటేల్, సిమ్రాన్, ప్రత్యూష. వీరందరిని ఇండియన్ టీ 20, వన్డే సిరీస్, మ్యాచులకు ఆడేందుకు 'బీసీసీఐ ' ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: