ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది.  ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రేక్షకులు ఊహించిన దానికంటే అంతకుమించి అనే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక ఈ సారి ప్రతి జట్టు కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తుంది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత ఏడాది ఎవరూ ఊహించని విధంగా పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. అయితే మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇక ప్రస్తుతం కేవలం దేశవాళీ క్రికెట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఊహించని విధంగా పేలవ ప్రదర్శన చేసి అందరిని నిరాశపరిచాడు మహేంద్రసింగ్ ధోని.


 కనీసం తన కెప్టెన్సీ వ్యూహాలు కూడా పనిచేయకపోవడంతో గత ఏడాది పేలవా ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఈ ఏడాది మాత్రం అద్భుతంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ..  మొదటి మ్యాచ్లో ఓడిపోవడంతో చివరికి అందరికీ నిరాశ మిగిలింది. ఆ తర్వాత మాత్రం ఊహించని విధంగా పుంజుకుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలను సాధిస్తూ దూసుకుపోతుంది.  ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్కతా నైట్రైడర్స్ తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణించి ఏకంగా 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది.



 ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇక మొదట్లో బాగా రాణించినట్టు అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం తడపడటంతో కేవలం 202 పరుగుల కు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. దీంతో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ దాదాపు  2013 తర్వాత తొలి బౌండరీ బాదాడు.  సునీల్ నరైన్ బౌలింగ్లో 2013 లో ధోని బౌండరీ కొట్టాడు. 64 బంతులు ఎదుర్కొని మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు వరకు బౌండరీ కొట్టలేకపోయాడు ఇక నిన్నటి మ్యాచ్ లో 65 బంతిలో మహేంద్రసింగ్ ధోని ఫోర్ కొట్టాడు. అయితే ఇప్పటి వరకు సునీల్ నరైన్ ధోని రెండుసార్లు అవుట్ చేశాడు. ఇకపోతే ధోని ఇప్పటివరకు సునీల్ నరైన్ బౌలింగ్లో ఒక్క సిక్స్ కూడా కట్టక పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: