ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఈ జట్టుని బ్యాడ్ లక్ మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఏ జట్టు లో లేని విధంగా బెంగళూరు జట్టు లో  ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎప్పుడు ఈ జట్టు మాత్రం టైటిల్ గెలవడంలో తడబడుతూనే ఉంటుంది. మొదట బాగా రాణించి అంచనాలను పెంచేసే బెంగళూరు జట్టు ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శన చేసి నిలకడలేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.  ప్రతి ఏడాది ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్లో రంగంలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరికి అభిమానులకు నిరాశే మిగులుస్తుంది.


 అయితే ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరింత పటిష్టంగా మారిపోయింది. స్టార్ ఆల్రౌండర్ లతో ప్రస్తుతం జట్టు ఎంతో దృఢంగా ప్రత్యర్థి జట్టును  చిత్తు చేసే విధంగా ఉంది. ఈ క్రమంలోనే మొదటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా రానిస్తుంది  అనే చెప్పాలి.  వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కూడా విజయం సాధించి ఐపీఎల్లో ఇప్పటివరకు బెంగళూరు జట్టుకు సాధ్యంకాని సరికొత్త రికార్డును సృష్టించింది కోహ్లీ సేన. కోహ్లీసేన దూకుడు చూస్తే ఇక ఈ సారి టైటిల్ గెలవడం ఖాయం అని అనుకున్నారు అందరు. అయితే  ఇక వరుస విజయాలతో ఓటమెరుగని జట్టుగా ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ లో దూసుకుపోతున్న బెంగళూరు జట్టు షాక్ తగిలింది.



 నిన్న మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్  జట్టుతో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమి చవి చూస్తుంది బెంగళూరు జట్టు. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అయితే కోహ్లీ జట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా చెన్నై  మాత్రం ఘన విజయాన్ని నమోదుచేసింది అయితే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్న బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి మరో షాక్ తగిలింది చెన్నై తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానా పడింది. అయితే బిసిసిఐ కొత్త రూల్స్ ప్రకారం ఇదే తప్ప మూడు సార్లు రిపీట్ అయితే ఏకంగా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.  మరోవైపు ఆర్సిబి పై విజయం సాధించిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: