ఇక తనపై ఉన్న నిషేధం పూర్తి కావడంతో గత ఏడాది మరో సారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు చేపట్టిన డేవిడ్ వార్నర్ మరోసారి జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు. కానీ ఈ సారి మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు డేవిడ్ భాయ్. కెప్టెన్సీలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇటీవల ఏం జరిగిందో తెలియదు కానీ సడన్గా డేవిడ్ వార్నర్ ను కెప్టెన్ గా తొలగిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నూతన కెప్టెన్గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు చేపట్టాడు.
కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ అటు తుది జట్టులో కూడా డేవిడ్ వార్నర్ కు అవకాశం కల్పించలేదు మేనేజ్మెంట్. దీంతో అందరూ అవాక్కయ్యారు. డేవిడ్ వార్నర్ కి మేనేజ్మెంట్ కి మధ్య ఏమైనా బేధాభిప్రాయాలు వచ్చాయా అన్న చర్చ కూడా మొదలయింది. ఈ క్రమంలోనే ఇటీవల స్పందించిన డెయిల్ స్టేయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. మనీష్ పాండే విషయంలో డేవిడ్ వార్నర్ ఎందుకలా నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదు ఇక డేవిడ్ వార్నర్ ని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ లో చూడటం కష్టమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.