ముఖ్యంగా మన భారతదేశం లో క్రికెట్ క్రీడా విభాగములో నిర్వహించబోయే ఐపీఎల్ అంటే ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తుంటారు. ఎందుకంటే ఈ ఐపిఎల్ మ్యాచ్లపై మనవాళ్లు బెట్టింగ్ లు కట్టి మరీ డబ్బులు పొందడం విశేషం. కొంతమంది ఐపీఎల్ మ్యాచ్ లను అవకాశంగా తీసుకొని ఎన్నో లక్షల్లో డబ్బులు గడించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది కాలం నుండి కరోనా కారణం చేత అంతర్జాతీయంగా వాయిదా పడ్డ ఐపీఎల్ మ్యాచ్ లు, అంటే 2021 లో మిగిలిన మ్యాచ్ లను యూఏఈ లో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ(BCCI ) స్పష్టం చేసింది. శనివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో వివో ఐపీఎల్ 2021 పార్ట్ 2 జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్ లను సెప్టెంబర్- అక్టోబర్ నెలలో ఇండియాలోనే నిర్వహించాలని భావించినా, దేశంలో వాతావరణం క్రికెట్ ఆడటానికి అనుకూలంగా లేకపోవడం బాధాకరమైన విషయం.
అందుకనే యూఏఈలో ఐపీఎల్ ను పూర్తి చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. వాయిదాపడిన ఐపీఎల్ ను తప్పకుండా పూర్తిచేయాలని ఎంజీఎంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు కార్యదర్శి జైషా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.
ఇక వచ్చే అక్టోబర్- నవంబర్ మాసాల్లో ఐపీల్ నిర్వహించాలని, అలాగే పురుషుల టీ20 వరల్డ్ కప్ కూడా నిర్వహించాలనే చర్చ జరిగింది. ఈ టోర్నీ పై స్పష్టత ఇచ్చేందుకు ఐసీసీతో బీసీసీఐ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. వారికి కాస్త సమయం కావాలని ఐసీసీ ని కోరామని ఆయన తెలిపారు. సరైన సమయంలో టీ 20 వరల్డ్ కప్ నిర్ణయం తీసుకోనున్నట్లు జైషా వెల్లడించారు. కాగా ఐపీఎల్ పూర్తిచేసి త్వరలోనే గవర్నింగ్ కౌన్సిలర్ విడుదల చేయనున్నామని తెలిపారు.
బీసీసీఐ అభివృద్ధి కమిటీ సభ్యులు వర్చువల్ పద్ధతిలో శనివారం అందరూ సమావేశం అయ్యారు. దీంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ప్రధాన చర్చ జరుగుతోంది.