అయితే భారత్ కు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ ను అటు కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ముద్దాడింది దీంతో భారత ప్రేక్షకుల కోరిక తీరింది అయితే 1983లో జరిగిన ప్రపంచ కప్ లో భారత జట్టు తరఫున ఎంపికయ్యాడు సునీల్ వాల్సన్. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఈ అవకాశాన్ని దక్కించుకోలేక పోయాడు . సాధారణంగా వరల్డ్ కప్ లో ఎంపికైనప్పుడు ఇక అవకాశం వస్తే తమను తాము నిరూపించుకోవాలని భావిస్తూ ఉంటారు ఆటగాళ్లు. వాల్సన్ కూడా ఇలాగే భావించాడు. ఎందుకంటే అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ గా అతని బౌలింగ్ అద్భుతం గా ఉండేది.
ఈ క్రమంలోనే ఇక అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాలి అనుకున్నాడు కానీ చివరికి అతనికి అవకాశం మాత్రం రాలేదు. అయితే సునీల్ వాల్సన్ కేవలం బెంచ్ కే పరిమితం అయ్యాడు అయినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వరల్డ్ కప్ ను గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సునీల్ వాల్సన్. అతని కెరీర్లో 1981 నుంచి 82 మధ్యకాలంలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇలా తన ఫాస్ట్ బౌలింగ్ తో అద్భుతంగా రాణించిన వాల్సన్ ప్రస్తుతం ఢిల్లీ రాజధాని జట్టు మేనేజర్ గా కొనసాగుతున్నారు.