ఇటీవలే భారత సీనియర్ ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టు ఇంగ్లాండ్లో వరల్డ్ టెస్ట్  చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత జట్టు చివరికి భారత అభిమానులందరి నిరాశపరిచింది.  పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఇక ఇప్పుడు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరి చూపు శ్రీలంక పర్యటనకు వెళ్లే యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు పైనే ఉంది.  ఇప్పటికే యువ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్లోనూ అద్భుతంగా రాణిస్తారు.  ఇక అన్నీ మ్యాచ్ లలో కూడా పరుగుల వరద పారిస్తారు.



 ఇలాంటి సమయంలో మొదటి సారి భారత జట్టు ఇలా యువ ఆటగాళ్లతో ఒక ప్రత్యేకమైన జట్టును రూపొందించి శ్రీలంక పర్యటనకు బీసీసీఐ  పంపడం భారీగా అంచనాలు పెంచుతోంది. అయితే ఈ జట్టుకు అటు రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరించడం మరింత ఆసక్తికరం గా మారిపోయింది. ఇప్పటికే తన కెరీర్లో కోచ్గా ఎంతోమంది ప్రతిభ గల యువ ఆటగాళ్లను టీ మీడియాకు అందించిన రాహుల్ ద్రావిడ్ ఇక ఇప్పుడు ఏకంగా టీమిండియా జట్టు కోచ్గా మారిపోవడంతో జట్టు అద్భుతంగా రాణిస్తుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు టీమిండియా ప్రేక్షకులు.



 ఇక తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టు గురించి యువ టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక పర్యటన భారత జట్టులోని యువ ఆటగాళ్లకు ఒక గొప్ప అవకాశం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు కెప్టెన్ శిఖర్ ధావన్. ముంబైలో 14 రోజులు క్వారంటైన్ లో ఉన్న భారత జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరేందుకు  సిద్ధమైంది. ఈ క్రమంలోనే యువ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో కలిసి వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్నాడు కెప్టెన్ శిఖర్ ధావన్. యంగ్ గన్స్ అందరూ కూడా శ్రీలంక టూర్ లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్. జూలై 13 నుంచి శ్రీలంక భారత్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: