టీ మిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌ మెన్‌ దీపక్ హూడా నిర్ణయం తీసుకున్నాడు. ఎంతో కాలంగా దేశవాలి క్రికెట్ లో బరోడా జట్టు బ్యాట్స్‌ మెన్‌  దీపక్ హూడా.. ఈ సంవత్సరం జనవరి మాసం లో బరోడా జట్టు కెప్టెన్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా తో... దీపక్ హూడ వివాదం తలెత్తిన సంగతి విధితమే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నేపథ్యంలో కృనాల్ పాండ్యా తో వివాదం కారణంగా జట్టు బయో సెక్యూర్ బబుల్ నుంచి వెళ్ళిపోయాడు దీపక్ హూడ. అయితే.. సంఘటన పై బరోడా క్రికెట్ అసోసియేషన్ దీపక్ పై  బాగా సీరియస్ అయింది.

 దీంతో మొదట్లో దీపక్ హూఢ పై నిషేదం విధించింది బరోడా క్రికెట్ అసోసియేషన్. అయితే ఐపీఎల్ మ్యాచ్లు సెప్టెంబర్ మాసం లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.... దీపక్ హూడా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో బరోడా టీం తరఫున ఇకముందు ఆడకూడదని... కూడా తాజాగా నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బరోడా క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ పత్రాన్ని కూడా దీపక్ తీసుకున్నాడు...  బరోడా నుంచి వచ్చిన దీపక్ హుడా రాజస్థాన్ తరఫున ఆడాలని  ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

 అయితే... బరోడా క్రికెట్ అసోషియేషన్‌...నుంచి దీపక్‌ హుడా తొలగిపోవడానికి అసలు కారణం కృనాల్‌ పాండ్యా అని తెలుస్తోంది.  కృనాల్‌ పాండ్యా తో జరిగిన వివాదం కారణంగానే బరోడా క్రికెట్ అసోషియేషన్‌ నుంచి వైదొలగాలని దీపక్‌ హుడా  నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ లో పంజాబ్‌ కింగ్స్‌ టీం తరఫున ఆడాడు దీపక్‌ హుడా. ఈ సీజన్‌ లో ఏకంగా 143. 30 స్ట్రైక్‌ రేట్‌ తో 116 పరుగులు చేసాడు దీపక్‌ హుడా. గతంలో దీపక్‌ హుడా హైదరాబాద్‌ తరఫున ఆడిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: