2012 లో జరిగిన ఒలంపిక్స్ లో భారతదేశం 4 కాంస్య, 2 రజత పతకాలు కైవసం చేసుకుంది. దీంతో ఒకే ఏడాదిలో ఆరు పతకాలు గెలిచి ఇండియా రికార్డ్ సృష్టించింది. నూట పదహారు ఏళ్ల ఒలంపిక్స్ హిస్టరీలో భారతదేశం కేవలం 28 పతకాలు మాత్రమే గెలిచింది. లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో 6... బీజింగ్ లో జరిగిన ఒలింపిక్స్ లో 3 గెలుచుకున్న భారతదేశం ఆ తర్వాత ఏ ఒలింపిక్స్ లో కూడా 2 కంటే ఎక్కువ మెడల్స్ సాధించలేదు.
అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నుంచి భారతదేశానికి అనుబద్ధత లభించిన తరువాత 1920 లో భారతీయులు ఒలింపిక్స్ ఆఫీసియల్ గా పాల్గొన్నారు. ఐతే 20 సంవత్సరాల ముందు, అనగా 1900లో కోల్‌కతాలో జన్మించిన అథ్లెట్ నార్మన్ ప్రిట్‌చార్డ్ ఒలింపిక్స్‌లో పాల్గొని.. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయుడు అయ్యారు. 1900లో సమ్మర్ ఒలింపిక్స్ సెకండ్ ఎడిషన్ పారిస్ లో జరగగా.. నార్మన్ ప్రిట్‌చార్డ్ 60 మీ, 100 మీ, 200 మీ, 110 మీ హర్డిల్స్, 200 మీ హర్డిల్స్ అనే ఐదు ఈవెంట్లలో పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు ఆయన 200 మీ హర్డిల్స్ లో సిల్వర్ మెడల్ కూడా గెలుచుకున్నారు. ఒలింపిక్స్.కామ్ ప్రకారం, గేమ్స్‌లో మెడల్ సాధించిన తొలి ఆసియన్ అథ్లెట్ ప్రిట్‌చార్డ్ అని పేర్కొంది. అయితే భారత గడ్డపై జన్మించిన బ్రిటిష్ లో పెరిగిన నార్మన్ ప్రిట్‌చార్డ్ ని ఒలంపిక్స్ హీరో గా పేర్కొంటుంటారు.