నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడలు పండుగ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. గత ఏడాది ఎంతో ఘనంగా జరగాల్సిన ఒలంపిక్స్ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కఠిన ఆంక్షలు మధ్య ఒలంపిక్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. టోక్యో వేదికగా జరుగుతున్న ఈ ఒలింపిక్స్లో తమ దేశం తరఫున పథకం సాధించేందుకు అందరూ క్రీడాకారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎంతగానో ప్రాక్టీస్ పూర్తి చేసి ఇక ఒలింపిక్స్లో పతకం సాధించేందుకు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



 అయితే ఇప్పటి వరకు ఇక ఒలింపిక్ చరిత్రలో భారత్ ఎన్ని పథకాలను గెలిచింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.  బ్రిటిష్ వలస పాలనలో ఉన్న  సమయంలో భారతీయ ప్రతినిధులు ఐదుగురూ ఇక ఒలంపిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏకంగా 200 మీటర్ల పరుగులో రెండు పతకాలు సాధించారు. ఇక ఆ తర్వాత ఇక 1928 నుంచి 1956 వరకు భారత హాకీ జట్టు ఎంతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే  ధ్యాన్ చంద్ మరియు బల్వంత్ సింగ్ లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్లో భారత్ కి ఏకంగా 11 పతకాలు సాధించి పెట్టారు. 1922 నుంచి 1956 వరకు వరుసగా బంగారు పతకాలు సాధించడం గమనార్హం.


ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ - 1952: పురుషుల ఫ్రీస్టైల్ బాంటమ్‌వెయిట్ (54 కిలోల కేటగిరీ) లో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా జాదవ్ చరిత్రను సృష్టించాడు.

పురుషుల హాకీ జట్టు - (1960-1964) భారత్ యొక్క అసమానమైన బంగారు పతకం సాధించే పరంపర ముగిసింది. అక్కడ వారు ఫైనల్‌లో 1-0తో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయి రజతం సాధించారు. ఇక ఆ తర్వాత 1964లో పాకిస్తాన్ ను ఓడించి ఇక బంగారు పతకాన్ని సాధించింది భారత హాకీ జట్టు.


పురుషుల హాకీ జట్టు - 1968 (మెక్సికో - కాంస్య), 1972 (మ్యూనిచ్ - కాంస్య), 1980 (మాస్కో - బంగారం): క్రమక్రమంగా హాకీ జట్టు ఆధిపత్యం తగ్గుతూ వచ్చింది , అక్కడ వారు కాంస్యం సాధించారు. 1980 లో వాసుదేవన్ బాస్కరన్ నాయకత్వంలో వారి ఎనిమిదవ బంగారు పతకాన్ని సాధించారు.

లియాండర్ పేస్ - అట్లాంటా, 1996:  లియాండర్ పేస్ కాంస్యం గెలుచుకున్నాడు. టెన్నిస్ క్రీడలో ఈ ఘనత సాధించారు.


 కరణం మల్లేశ్వరి - 2000: వెయిట్ లిఫ్టర్ 54 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తద్వారా అలా చేసిన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది.

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ - 2004: ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన దేశం నుండి మొదటి షూటర్‌గా రాథోర్ నిలిచాడు, అంతేకాకుండా  అతను క్రీడల్లో దేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత రజత పతక విజేత కూడా కావడం గమనార్హం.

 2008: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా బంగారు పతకాన్ని సంపాదించాడు. అతను ఇప్పటికీ భారతదేశపు ఏకైక ఒలింపిక్ బంగారు పతక విజేతగా మిగిలిపోయాడు. 56 సంవత్సరాల విరామం తరువాత, రెజ్లర్ సుశీల్ కుమార్ పురుషుల ఫ్రీస్టైల్ (66 కిలోలు) విభాగంలో కాంస్యం సాధించాడు.


లండన్ 2012: బ్రిటిష్ రాజధానిలో జరిగిన 2012 సమ్మర్ ఒలింపిక్స్ భారతదేశానికి అత్యుత్తమ పతకాలు సాధించింది. భారత బృందం మొత్తం ఆరు పతకాలు సాధించింది., రెజ్లర్ సుశీల్ కుమార్ రజత పురుషుల ఫ్రీస్టైల్ లో వరుస వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయుడు అయ్యాడు. ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ పురుషుల ఫ్రీస్టైల్ (60 కిలోలు) విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించింది.. ఇక ఆ తర్వాత బాక్సింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా బాక్సర్ మేరీ కోమ్ నిలిచింది. అదే సమయంలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు షూటర్ గగన్ నారంగ్.

రియో డి జానెరియో, 2016: పురుషుల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టి, సాక్షి మాలిక్ మహిళల ఫ్రీస్టైల్ 58 కిలోల విభాగంలో తన కాంస్య పతకంతో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ గా నిలిచింది . ఇంతలో, పివి సింధు  ఒలింపిక్స్ ఫైనల్స్కు చేరుకోవడం ద్వారా బ్యాడ్మింటన్లో బంగారు పథకానికి దగ్గరికి వెళ్ళింది. చివరికి అడుగు దూరంలో ఓడిపోయిన ఆమె ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు (21) పీవీ సింధు నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: