అయితే ఇప్పటి వరకు చాలా మంది క్రీడాకారులు గత ఒలంపిక్స్ లో నిరాశ చెంది ఇక ఈ ఒలింపిక్స్ లో తప్పనిసరిగా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న వారు ఉన్నారు. అయితే కొంత మంది మాత్రం అప్పుడే ఒలంపిక్స్ లోకి అడుగు పెట్టినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏకంగా బంగారు పథకాలను సైతం ఎగరేసుకు పోతున్నారు. ఇటీవలే 13 ఏళ్ల చిన్నారి ఒలింపిక్స్ లో పతకం సాధించింది అంటే ఎవరైనా నమ్ముతారా. 13 ఏళ్ల చిన్నారి కేవలం స్కూల్ కి వెళ్తూ ఆటలు ఆడే చిన్నారి ఏకంగా ఒలింపిక్స్ లో పతకం సాధించడమా జోక్ చేయకండి బాసు అని అంటారు ఎవరైనా ఈ మాట చెబితే. కానీ ఇక్కడ ఓ 13 ఏళ్ల చిన్నారి మాత్రం ఏకంగా బంగారు పతకాన్ని సాధించింది.
అంతేకాదు మరో 13 ఏళ్ల చిన్నారి ఇక సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటింది ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా 13 ఏళ్ళ వయసులోనే ఒలంపిక్ ఛాంపియన్స్ గా నిలిచి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించారు ఈ బాలికలు. ఉమెన్స్ స్కేట్ బోర్డింగ్ పోటీల్లో జపాన్కు చెందిన నిషియా మోమేజి అనే 13 ఏళ్ల చిన్నారి బంగారు పతకాన్ని గెలుచుకుంది. అయితే ఇక ఇదే పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది రాయ్సా లీల్ అనే బాలిక కూడా. ఆమె వయస్సు కూడా 13 ఏళ్ల వయస్సు కావటం గమనార్హం. బంగారు పతకం గెలుచుకున్న నిషియా జపాన్కు చెందిన అథ్లెట్ కాగా.. ఇక సిల్వర్ మెడల్ గెలుచుకున్న రాయ్సా బ్రెజిల్కు చెందిన క్రీడాకారిని కావడం గమనార్హం. కాగా అతి చిన్న వయసులోనే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్గా నిషియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది కాగా ఈ ఏడాది ఒలంపిక్స్ లో స్కెట్ బోర్డింగ్ ఆటను ప్రవేశపెట్టడం గమనార్హం.