
ఇక ఆ తర్వాత రెండోసారి ఒలింపిక్స్ లో భారత్కు కాంస్య పతకాన్ని అందించిన స్టార్ షట్లర్ పీవీ సింధు అటు తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టి దేశానికి గర్వ కారణం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక మరికొంతమంది పథకం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే భారత్కు చెందిన ఒక యువ అథ్లెట్ ఏకంగా సంచలనమే సృష్టించాడు. ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఒలంపిక్స్ లో ఆడిన అనుభవం ఆ అథ్లెటిక్ లేదు. అయినప్పటికీ ఒత్తిడిని చిత్తు చేస్తూ ఆ అథ్లెట్ ప్రతిభ కనబరిచిన తీరు ప్రస్తుతం భారత ప్రజానీకాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇటీవలే ఒలంపిక్స్ లో సంచలనమే సృష్టించాడు.
ఒలంపిక్స్ లో భారత్ కూ చెందిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా ఇరగదీశాడు. ఇటీవలే జరిగిన జూవేలిన్ పోటీల్లో నెగ్గిన ఏకంగా ఫైనల్కు అర్హత సాధించాడు. అయితే జూవేలిన్ విభాగంలో ఈ ఫీట్ సాధించిన మొట్ట మొదటి భారతీయుడిగా అరుదైన ఘనతను సాధించాడు. ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఏకంగా అప్పటి వరకు సీనియర్స్ గా ఉన్న వారి కంటే ఎక్కువ దూరం విసిరి రికార్డు సృష్టించాడు. ఏకంగా 86.65 మీటర్ల దూరం నీరజ్ చోప్రా విసరగలిగాడు. 23 ఏళ్ల యువ క్రీడాకారుడు మొట్టమొదటిసారి ఒలంపిక్స్ లో అడుగుపెట్టి తన ప్రతిభతో ఆశ్చర్య పరిచాడు. ఆగస్టు 7వ తేదీన జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో టాప్ త్రీ లో నిలిస్తే ఏదో ఒక పథకాన్ని సాధించ గలుగుతాడు ఈ యువ అథ్లెట్. ఇప్పటి వరకు ఇద్దరు మహిళా క్రీడాకారులు పతకాలు సాధించగా.. ఇక పురుషుల విభాగంలో యువకుడు సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.