ఒలింపిక్ గేమ్స్ లో ఇంకో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనితో అన్ని దేశాలు పతకాల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడం కోసం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఎప్పటి లాగే చైనా పతకాల పట్టికలో ఎక్కువ బంగారు పతకాలు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా రెండవ స్థానంలో అగ్ర రాజ్యం అమెరికా ఉంది. ఇక మన భారతదేశం విషయానికి వస్తే 62 వ స్థానంలో కొనసాగుతోంది. టోర్నీ మొదటి నుండి కొన్ని విభాగాల్లో బంగారు పతక ఆశలు రేపినప్పటికీ, అవి కాస్తా కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిన్న జరిగిన పురుషుల హాకీ విభాగంలో సెమీఫైనల్ లో బెల్జియం చేతిలో 2-5 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇకపోతే ఈ రోజు ఇండియా మహిళలు అర్జెంటీనాతో సెమీఫైనల్ జరుగుతోంది. అందరి ఆశలు మహిళల మీదనే నెలకొంది. 
ఖచ్చితంగా ఫైనల్ కు వెళుతుంది అనే నమ్మకం అందరిలో ఉంది. మొదటి అర్ధ భాగంలో ఇద్దరూ చెరో గోల్ చేసి సమంగా ఉన్నప్పటికీ, అనూహ్యంగా అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. చివరి ఒకటిన్నర నిముషం చాలా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఒత్తిడిని తట్టుకోలేని ఇండియా పురుషుల లాగే 2-1 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓటమిని మూట గట్టుకుంది. ఒకానొక దశలో ఇండియాకు గెలిచే అవకాశాలున్నా ప్రత్యర్థి దూకుడు ముందు తేలిపోయింది.
ఫైనల్ ఆశలు ఆవిరవడంతో ఇక కాంస్య పతకం కోసం పోరు జరగనుంది. బంగారు ఎలాగూ పోయింది కాంస్యమైనా సాధిస్తారా అని భారతదేశ ప్రజలంతా నమ్మకంతో ఉన్నారు. సెమీఫైనల్ ఫోబియా లాగా భారత్ కి చెందిన హాకీ జట్లు ఓటమి పాలవ్వడం భారతీయులను తీవ్రంగా నిరాశపరిచింది. మహిళలు వారి శక్తి మేరకు పోరాడినా అర్జెంటీనా అనుభవం ముందు నిలువలేక పోయింది. ఏదేమైనా మహిళలు తల ఎత్తుకునేలా ఆడారని చెప్పాలి. ఎప్పుడో టోర్నీ నుండి నిష్క్రమించాల్సిన భారత్ టీం  అనూహ్యంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లడం అద్భుతం...
   

మరింత సమాచారం తెలుసుకోండి: