టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా...సంచలనం సృష్టించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ పోరులో...బంగారు పతకం సాధించాడు. భారత్‌ ఖాతాలో 7వ మెడల్‌ను జత చేశాడు. ఫైనల్‌ ఫైట్‌ ఫస్ట్‌ అటెంప్ట్‌లో 87.03 దూరం విసిరాడు. సెకండ్‌ అటెంప్ట్‌లో 87.58 మీటర్ల దూరం విసిరాడు. మూడో అటెంప్ట్‌లో 76.79 మీటర్ల దూరం వేశాడు. నీరజ్ చోప్రా విసిరిన దూరాన్ని ఏ అథ్లెడ్‌ కూడా అధగమించలేడు. నీరజ్‌ చోప్రా దరిదాపుల్లోకి కూడా రాలేదు. దీంతో బంగారు పతకాన్ని సాధించాడు నీరజ్‌ చోప్రా.

అయితే... టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్‌ చోప్రాను బాహుబలి అంటూ ప్రశంసించారు. ఈ క్రమంలో రితేష్‌ జైన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీ 700ని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. రితేష్‌ అభ్యర్థనను అంగీకరించిన ఆనంద్‌ మహీంద్ర.. ''తప్పకుండా ఇస్తానని ప్రకటించాడు.

స్వర్ణం సాధించిన మా అథ్లెట్‌కు ఎక్స్‌యూవీ 700 బహుమతిగా ఇవ్వడం తనకు ఎంతో గౌరవమని రిప్లై ఇచ్చాడు. ఇక అటు టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకం తీసుకొచ్చి గర్వపడేలా చేసిన నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. 6కోట్ల రూపాయల నగదు.. గ్రూప్ 1ఉద్యోగం ఇస్తున్నట్టు తెలిపింది. 50శాతం రాయితీతో ఇంటి స్థలం కేటాయిస్తున్నట్టు పేర్కొంది. ఈ 23ఏళ్ల అథ్లెట్ విజయంతో దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు. తన కుమారుడి ట్రైనింగ్ కష్టం చూశాక తప్పకుండా మెడల్ వస్తుందని భావించానని నీరజ్ తండ్రి చెప్పారు. ఇక అటు టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్‌ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఏకైక స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాకు కోటి రూపాయలు బహుమతిగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: