ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయితే చాలు అనుకునే క్రీడాకారులు బోలెడు మంది ఉన్నారు. ఇక ఒకవేళ ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసి దేశం తరఫున మెడల్ సాధిస్తే ఇక ఆనందమే వేరు. కాగా, మనం తెలుసుకోబోయే ఈ క్రీడాకారిణి ఒలింపిక్స్‌లో అర్హత సాధించడమే కాదు ఏకంగా పది మెడల్స్ సాధించింది. ఇంతకీ ఆ క్రీడాకారిణి ఎవరు? ఏ దేశం తరఫున విశ్వ క్రీడా సంబురాల్లో పాల్గొంది? అనే వివాలు తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

అమెరికాకు చెందిన స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ ఆ దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ స్టార్ మహిళా అథ్లెట్ ఒలింపిక్స్‌లో సత్తా చాటడమే కాదు  అగ్రరాజ్య పౌరులందరూ గర్వపడేలా చేసింది. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ క్రీడాంశంలో హయ్యెస్ట్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా అలీసన్ చరిత్ర సృష్టించింది. జపాన్ రాధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్‌లో జరిగిన మహిళల 400 మీటర్ల ఫైనల్‌ రేసులో 35 ఏళ్ల ఫెలిక్స్‌ 49.46 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఈ మెడల్‌తో పది ఒలింపిక్‌ మెడల్స్‌ అనగా ఆరు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యం ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో అత్యధిక మెడల్స్‌గా సాధించిన ఉమన్‌గా అలీసన్ ఫెలిక్స్ ఘనత సాధించింది. ఆమె సాధించిన మెడల్స్‌లో ఆరు స్వర్ణపతకాలే కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్ కంటే ముందు వరకు ఈ రికార్డు జమైకా అథ్లెట్‌ మెర్లిన్‌ ఒట్టి పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రికార్డును అగ్రరాజ్య అథ్లెట్ ఫెలిక్స్ బద్దలు కొట్టారు. మెర్లిన్ తొమ్మిది మెడల్స్ గెలుచుకోగా, ఫెలిక్స్ ఆమె కంటే ఒక పతకం ఎక్కువ సాధించి ఆమె రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ హిస్టరీలో హయ్యెస్ట్ మెడల్స్ సాధించిన అమెరికా అథ్లెట్‌గా కార్ల్ లూయిస్ ఉండగా, ఆమె సరసన ఫెలిక్స్ కూడా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: