నీరజ్ చోప్రా..  23 ఏళ్ల బల్లెం వీరుడి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇతడి ప్రతిభకు అటు భారత ప్రజానీకం మొత్తం దాసోహం అయ్యింది.  భారత 100 ఏళ్ల నిరీక్షణకు తెర దింపిన యువకుడికి ప్రస్తుతం 130 కోట్ల ప్రజానీకం సలాం కొడుతుంది.  అంతే కాదు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం భారీగా నజరానాలు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే ఒలంపిక్స్ ముగింపు దశకు వచ్చిన సమయంలో ఇక ఈ సారి కూడా భారత్కు స్వర్ణం అనేది కలగానే మిగిలిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఇక అలాంటి సమయంలో జూవేలిన్ త్రో విభాగంలో అద్భుతమే సృష్టించాడు 23 ఏళ్ళ నీరజ్ చోప్రా.



 ఏకంగా 87.56 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. ఎలా ఇక భారత చరిత్రలో 100ఏళ్ళ నిరీక్షణకు తెర దించాడు నీరజ్ చోప్రా.  నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన నాటి నుంచి ఇక ఇతని గురించి తెలుసుకునేందుకు ఎంతోమంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నీరజ్ కి  సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. అయితే ఇటీవలే నీరజ్ చోప్రా అత్యంత సన్నిహితుడు అయిన తేజస్విని శంకర్ నీరజ్ చోప్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   ఒలంపిక్స్  లో బంగారు పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రా లొ ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు.



 బెంగళూరులో రెండు వారాల పాటు నీరజ్ చోప్రా తో ఒక గదిని పంచుకున్నాను అంటూ ఇటీవలే తేజస్విని శంకర్ తెలిపారు. అయితే నీరజ్ చోప్రా తో గదిని పంచుకోవడానికి ఎప్పుడూ భయపడుతూ  ఉంటాను అంటూ తెలిపాడు. ఎందుకంటే నీరజ్ చోప్రా ఇక గదిని శుభ్రంగా ఉంచుకోడని తన బట్టలను ఎక్కడపడితే అక్కడ పడేస్తాడు అని.. అంతేకాకుండా సాక్స్ గది మధ్యలో ఆరబెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు అథ్లెట్ తేజస్విని శంకర్. అయితే ఇక నీరజ్ చోప్రా అలా చేయడం తనకు ఎంతో ఇబ్బంది కలిగించిందని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఈ విషయాన్ని అతనికి ఎప్పుడూ చెప్పలేదని ఎంతో సన్నిహితంగానే ఉన్నాను అంటూ తెలిపారు.



 అయితే ఇక 15 రోజులు ఒకే గదిలో ఉన్న సమయంలో మేమిద్దరం ఫ్రైడ్ రైస్, మట్కా కుల్ఫీ ఎంతో ఇష్టంగా చాలాసార్లు తిన్నాము అంటూ గుర్తు చేశారు తేజస్విని శంకర్. ఇక నీరజ్ చోప్రా కి మినీ మిలిషియా అనే ఒక వీడియో గేమ్ పిచ్చి కూడా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నీరజ్ చోప్రా ఆ గేమ్ ఆడటం మానేసాడని.. ఇక ఇప్పుడు పబ్జి ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు తేజస్విని శంకర్. ఇలా నీరజ్ చోప్రా కు గురించి తెలియని ఎన్నో విషయాలను ఇటీవలే మీడియాతో పంచుకున్నారు తేజస్విని శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: