ఒలంపిక్స్ లో గొప్పగా ప్రతిభ చాటావు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఇక నీరజ్ చోప్రా ఇండియా చేరుకున్న తర్వాత కూడా స్వయంగా కలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రాను ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే దేశ రాజధాని ఢిల్లీలో కలిశారు. ఇలా కొంత సమయం పాటు నీరజ్ చోప్రా తో సమావేశమైన నరవాణే ఇక అతని ప్రతిభను అభినందించారు. అదే సమయంలో ఇక నీరజ్ చోప్రా కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీ చేరుకున్నారు.
నీరజ్ చోప్రా ను కలిసేందుకు వెళ్లగా ఇక వారితో కూడా ఆర్మీ చీఫ్ సమావేశమయ్యారు. టోక్యో ఒలంపిక్స్ జూవెలిన్ త్రో లో మెడల్ సాధించి అసమాన విజయాన్ని సాధించారు అంటూ అభినందించారు. నరవాణే ఇటీవలే నీరజ్ చోప్రా సహా అతని కుటుంబ సభ్యులతో సమావేశం అయిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇవి కాస్త వైరల్ గా మారిపోయాయి. కాగా ఇటీవలే స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాకు ఆర్మీలో సుబేదార్ అనే ఒక హోదాను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. 2016లో నాయబ్ సుబేదార్ గా రాజ్పుతానా రైఫిల్స్ లో చేరాడు నీరజ్ చోప్రా. ఇక ఇప్పుడు సుబేదారుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకి గౌరవార్ధం గా రాజ్పుతానా రైఫిల్స్ సైనికులు ఆగస్టు 7వ తేదీన బంగారు పతక విజేత వేడుకను జరుపుకోవడం గమనార్హం.