అయితే టి20 వరల్డ్ కప్ భారత్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య భారత్లో కాకుండా యూఏఈ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక దీనికి సంబంధించిన షెడ్యూలు కూడా ఇప్పటికే ప్రకటించింది ఐసీసీ. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ టి20 వరల్డ్ కప్ కు ప్రేక్షకులను అనుమతి ఇస్తారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ మొదలయింది అంటే ఏ జట్టు ఎలా రాణిస్తుంది.. సెమీ ఫైనల్కు అర్హత సాధించే జట్లు ఏవి.. కప్పు కొట్టె జట్టు ఏది అని ఎంతోమంది తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం మొదలు పెడుతూ ఉంటారు.
ఇక ఎప్పుడు భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్కు ఏ జట్లు వెళ్తాయి అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా విజేతగా ఏ జట్టు నిలుస్తుంది అన్న విషయంపై కూడా ప్రస్తావించాడు. భారత్,న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు టి20 వరల్డ్ కప్ లో తప్పకుండా సెమీఫైనల్కు చేరుకుంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా జట్టు టి-20 వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ చెప్పగా దీనిపై స్పందించిన గౌతం గంభీర్ మీరు ఏ జట్టు గెలుస్తుందనీ.. అనుకుంటున్నారు మీ అంచనాలు ఏంటి కామెంట్ చేయండి అంటూ ప్రేక్షకులకు ఈ విషయాన్ని వదిలేశాడు.