ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అంటే ఏ రేంజిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు కోట్ల మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతలా క్రికెట్ కి ప్రస్తుతం క్రేజ్ ఉంది. అయితే అటు ప్రపంచ క్రికెట్లో మహిళల క్రికెట్ తో పోల్చి చూస్తే పురుషుల క్రికెట్ కు బాగా క్రేజ్ ఉంటుంది.  పురుషుల క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు అటు ఎంతో ఉత్కంఠగా వీక్షించే ప్రేక్షకులు.. మహిళల క్రికెట్ మ్యాచ్ మాత్రం కాస్త లైట్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఇలా జరగడం లేదు. ఎందుకంటే పురుషులు క్రికెట్ కి తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు మహిళా క్రికెటర్లు .



 ఎంతో మంది మహిళా క్రికెటర్లు సైతం అద్భుతంగా రాణిస్తూ ఇక రికార్డులను సైతం కొల్లగొడుతున్నారు. ఇలా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల అందరి చూపులూ మహిళా క్రికెట్ వైపు తిప్పుకో గలుగుతున్నారు  ఇలా క్రమక్రమంగా ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళల క్రికెట్ కి కూడా ఎంతగానో గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవలే ఏకంగా ఒక మహిళా క్రికెటర్ ఒక అరుదైన రికార్డును సాధించింది. ఇక ఈమె సాధించిన రికార్డు ఎంత అరుదైనది అంటే ఇప్పటి వరకు ప్రపంచ  క్రికెట్లో కూడా ఏ ఒక్కరు సాధించలేనిది.  టి20 క్రికెట్ లో ఒక హిస్టరీ ఈ మహిళ సాధించిన రికార్డు.  ఇక ఈ రికార్డుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపు ఆకర్షించింది.


 నెదర్ ల్యాండ్ కు చెందిన ఫ్రెడరిక్ ఓవర్డిక్ అనే ఒక మహిళ బౌలర్ ఇటీవల ప్రాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది.  తన బౌలింగ్ ప్రతిభతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఏకంగా మూడు పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టింది ఈ మహిళ బౌలర్. తద్వారా ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్ లో సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు టి 20 క్రికెట్ లో ఒకే ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు లేరు. ఈ రికార్డు సాధించిన తొలి బౌలర్గా గుర్తింపు పొందింది ఈ మహిళా క్రికెటర్. అయితే పురుషుల విభాగంలో కూడా ఇప్పటివరకు ఎవరూ ఏడు వికెట్లు తీయలేక పోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: