ఒకానొక సమయంలో ధోనీ విశ్రాంతి తీసుకున్న సమయంలో వైస్ కెప్టెన్ గా ఉన్న సురేష్ రైనా టీమ్ ఇండియా జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఏకంగా టీమిండియాకు 12 వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లకు కెప్టెన్గా వ్యవహరించాడు సురేష్ రైనా. ఇలా సురేష్ రైనా కెప్టెన్ గా ఉన్న సమయంలో కొంత మంది ఆటగాళ్లు భారత క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వారు కూడా ఉన్నారు. వీళ్ళలో ప్రస్తుతం కొంతమంది పాపులర్ క్రికెటర్లు కూడా ఉండడం గమనార్హం. ప్రస్తుతం టీమిండియా లో కీలకమైన స్పిన్నర్ గా సుదీర్ఘకాలంపాటు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సురేష్ రైనా కెప్టెన్సీలోనె టి20 లో అడుగుపెట్టాడు
టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా కూడా 2010లో జింబాబ్వే లో జరిగిన ట్రై సిరీస్ లో ఇక సురేష్ రైనా కెప్టెన్ గా ఉన్నప్పుడే వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఇక అప్పుడు జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. అశోక్ దిందా పేలవ ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్న ఉమేష్ యాదవ్ కూడా సురేష్ రైనా కెప్టెన్సీలోని టీమిండియాతో అరంగేట్రం చేయడం గమనార్హం. అటు అశోక్ దిండా ఆడిన తొలి మ్యాచ్లోనే ఉమేష్ యాదవ్ కూడా టీమిండియాలో ఆరంగేట్రం చేశాడు. ఇక ఇదే సిరీస్ లో మరో ఫాస్ట్ బౌలర్ వినయ్ కుమార్ కూడా టీమిండియా తరఫున సురేష్ రైనా కెప్టెన్సీలో అరంగేట్రం చేయడం గమనార్హం. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 2003లో వన్డేల్లోలో వచ్చినప్పటికీ టీ20ల్లో మాత్రం 2010లో జింబాబ్వే పర్యటనలోనే అయినా కెప్టెన్సీలో టి20లో కి అరంగేట్రం చేయడం గమనార్హం.