
రిజర్వు కీపర్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇక అల్ రౌండర్ ల విషయానికొస్తే హార్దిక పాండ్య, రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ ఉన్నారు. రిజర్వ్ అల్ రౌండర్ గా కృనాల్ పాండ్య ఉన్నాడు. ఇక బుమ్రా, భువనేశ్వర్, మహమ్మద్ షమీ పేస్ విభాగాన్ని చూసుకోనున్నారు. అయితే అందరినీ ఆశ్చర్య పరిచే నిర్ణయం ఏమిటంటే, స్పిన్నర్లుగా ఇంటర్నేషనల్ అనుభవం లేని వారిని తీసుకోవడం. ఐపీఎల్ లో రాణించిన రాహుల్ చాహర్ మరియు వరుణ్ చక్రవర్తి లను స్పిన్నర్ లుగా ఎంపిక చేశారు. మరో స్పిన్నర్ గా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉండడం ఇండియాకు కలిసొచ్చే అంశం. గత కొద్ది సంవత్సరాలుగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో స్పిన్నర్లుగా ర్ణయిస్తున్న యుజ్వేంద్ర చాహల్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరికీ సెలెక్టర్లు మొండి చేయి చూపారు.
ఇది అందరికీ షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి. అంతే కాకుండా నాలుగు సంవత్సరాల తర్వాత భరత్ టీ 20 ఇంటర్నేషనల్ టీం లో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో ఇండియాకు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ కు నిరాశ తప్పలేదు. రిజర్వు ప్లేయర్లుగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు దీపక్ చాహర్ ఎంపికయ్యారు.