ప్రస్తుతం ఐపీఎల్ పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇక లీగ్ మ్యాచ్లో చివరి దశకు చేరుకున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఢిల్లీ కాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్,  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధించగా.. ఇక నాలుగవ స్థానం కోసం ప్రస్తుతం పలు జట్లు పోరాటం సాగిస్తు న్నాయి.  ఈ క్రమంలోనే ఇక ప్లే ఆప్ కి అర్హత సాధించబోయే ఆ నాలుగవ జట్టు ఏది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నాలుగవ స్థానంలో నిలిచేందుకు ప్రతి జట్టు కూడా ఊహించని విధంగా అద్భుతంగా  పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఈక్రమంలోనే ఐపీఎల్లో రోజుకొక కొత్త సూపర్ స్టార్ పుట్టుకొస్తున్నాయి.  ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.



 కీలక సమయంలో వికెట్లు పడగొట్టి తో జట్టు విజయంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఎంతో మంది ఆటగాళ్లు. ఇకపోతే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు అన్ని విభాగాల్లో కూడా ఆధిపత్యం సాధించి  ఘన విజయాన్ని సాధించింది.  ఇక కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనవిజయం సాధించడంతో ఇంకా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ క్రమంలోనే ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు  ఘోర పరాజయం పాలయ్యింది.. ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టంగా మార్చుకుంది.



 అయితే రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ శివమ్ మావి నిలిచాడు. అయితే విజయం అనంతరం మాట్లాడిన శివమ్ మావి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ ఫై రాణించడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ మీద తక్కువ బౌన్స్ ఉంది. అందుకే వికెట్ టూ వికెట్ బౌలింగ్ చేయాలని మా జట్టు ప్లాన్ వేసింది  ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు అవకాశం ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాం. నేను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో ఎంతగానో నేర్చుకున్నాను. శివం దుబే వికెట్ పడగొట్టడం  ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ వికెట్ ఎంతగానో నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు శివమ్ మావి . నాగ కోల్కతా నైట్ రైడర్స్ విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సరళంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl