రాత్రి జరిగిన ఐపిఎల్ 14 సీజన్ క్వాలిఫైయర్ 2 లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్ పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రేపు జరగబోయే ఫైనల్ లో చెన్నై తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు క్రికెట్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఢిల్లీ చెన్నై తో జరిగిన మ్యాచ్ లోనే  గెలవాల్సి ఉంది. కానీ రిషభ్ పంత్ చేసిన తప్పుల కారణంగా ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్ అవేష్ ఖాన్ కి కాకుండా రబడా కి ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆకాష్ చోప్రా వ్యాఖ్యలు చేశాడు. అనుభవ లేమి కారణంగా మ్యాచ్ ను కోల్పోయిన ఢిల్లీ ఫైనల్ చేరడం కష్టమేనని జోస్యం చెప్పాడు. ఇప్పుడు అదే జరిగింది... అయితే గత మ్యాచ్ నుండి రిషభ్ పంత్ ఏమీ నేర్చుకోలేదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో కూడా కొన్ని పొరపాట్లు చేసి మ్యాచ్ ను ఢిల్లీ ప్రేక్షకుల కలను నాశనం చేశాడు. అయితే రిషభ్ చేసిన పొరపాట్లు ఏమిటో ఒకసారి చూద్దాం.

* షార్జా పిచ్ మొదటి ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది అని తెలిసినా పవర్ ప్లే ను పూర్తిగా వాడుకోవడంలో విఫలం అయింది.

* మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ నెమ్మదించింది .

వికెట్లు చేతిలో ఉన్నా కనీసం సింగిల్స్ తీయడానికి కూడా అష్టకష్టాలు పడ్డారు ఢిల్లీ ఆటగాళ్ళు.

* రిషభ్ పంత్ మ్యాచ్ లో ఇంకా 5 ఓవర్లు మిగిలినవారి అనవసర షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. చివరి వరకు పంత్ ఉండి ఉంటే తన కున్న హిట్టింగ్ స్కిల్స్ తో మరో 10 నుండి 15 పరుగులు వచ్చి ఉండేవి. కానీ చివరికి 135 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.

* ఇక చేజింగ్ లో కే కే ఆర్  మొదటి నుండి అటాకింగ్ గేమ్ ఆడింది. కనీసం పవర్ ప్లే లో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి ఉంటే ఖచ్చితంగా ఢిల్లీ గెలిచేది. కానీ కే కే ఆర్ 96 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

" అలా మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వచ్చింది. ఆఖరి ఓవర్ కు 7 పరుగులు చేయాలి. కానీ బౌలింగ్ ఆప్షన్ అశ్విన్ మాత్రమే ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఉంది ఉంటే గెలుపు ఢిల్లీ దే... కానీ అప్పటికే అందరి కోటా ఓవర్లు పూర్తి అయిపోయాయి. రబాడా లేదా నార్జే చివరి ఓవర్ బౌలింగ్ చేసుంటే ఫలితం ఖచ్చితంగా మరుండేది.

ఇలా రిషభ్ సేన చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా మరోసారి ఐపిఎల్ ట్రోఫీ అందని ద్రాక్షలా మిగిలి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: