ఐపీఎల్ తుది పోరుకు అంతా సిద్ధమైంది. మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టైటిల్ పోరులో ఈ రోజు తలపడనున్నాయి. మోర్గాన్ నేతృత్వంలోని  కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు, ధోనీ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండూ బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఆఖరి మ్యాచ్ లో ఏ జట్టు ఎవరికి పంచ్ ఇస్తుందో చూడాలి. నాలుగో ట్రోఫీ నెగ్గాలని చెన్నై సూపర్ కింగ్స్, మూడో కప్ సాధించాలని కోల్ కతా నైట్ రైడర్స్ ఆశిస్తున్నాయి. నేటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ మ్యాచ్ 9వ ఫైనల్ కాగా.. కోల్ కతా నైట్ రైడర్స్ కు మూడోది. 2008, 2010, 2011, 2013, 2015, 2018, 2019, 2021లో చెన్నై ఫైనల్స్ కు వెళ్లగా మూడు సార్లు అనగా 2010, 2011, 2018లో టైటిల్ సాధించింది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ 2012, 2014, 2021లో తుది సమరానికి అర్హత సాధించింది. 202, 2014లో రెండు సార్లు కప్పుకొట్టింది. మరి చెన్నై నేడు నాలుగవ సారి విజేతగా నిలుస్తుందా.. ?  కేకేఆర్ ముచ్చటగా మూడోసారి కప్పు సాధిస్తుందా అనేది చూడాలి.

ఇక ఐపీఎల్ సీజన్ కు రెండు కొత్త జట్లు వస్తుండటంతో.. ఆ రెండు జట్లకు బీసీసీఐ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. వేలంపాటకు ముందే తమకు నచ్చిన కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు అనుమతించింది. అన్ని జట్లు సమతూకంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ఎంతమంది ఆటగాళ్లను తీసుకోవాలనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే 2-3ఆటగాళ్లను తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఐపీఎల్ 2022 మెగా వేలంలో ప్రస్తుతం ఉన్న 8 ఫ్రాంచైజీలు ఎంతమంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చనే దానిపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా నలుగురిని రిటైన్ చేసుకునేలా బీసీసీఐ రూల్స్ తేనుందని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు భారత ప్లేయర్లు, ఒక విదేశీ ఆటగాడు ఉండాలట.



మరింత సమాచారం తెలుసుకోండి: