భార‌త క్రికెట్ జ‌ట్టు కొత్త కోచ్ గా మాజీ కెప్టెన్‌, సీనియ‌ర్ ఆట‌గాడు రాహుల్ ద్ర‌విడ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. సుధీర్ఘ కాలం భార‌త జ‌ట్టుకు కోచ్ గా ఉంటోన్న మ‌రో సీనియ‌ర్ ఆట‌గాడు, మాజీ ఓపెన‌ర్ ర‌విశాస్త్రి ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లోనే ముగి య నుంది. దీంతో మ‌న జ‌ట్టుకు కొత్త కోచ్ ఎంపిక అనివార్యం అయ్యింది. భార‌త క్రికెట్ జ‌ట్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం 60 సంవ‌త్స‌రాలు దాటిన వారు కోచ్ గా ఉండేందుకు అన‌ర్హులు. ర‌వి శాస్త్రి వ‌య‌స్సు త్వ‌ర‌లోనే 60 క్రాస్ అవుతుంది. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం చూస్తే ఆయ‌న కోచ్ గా ఉండేందుకు అన‌ర్హుడు. దీంతో ఇప్పుడు కొత్త కోచ్ ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ముందుగా ప‌లువురు విదేశీ ఆట‌గాళ్ల పేర్లు కూడా ప‌రి శీల‌న‌కు వ‌చ్చాయి. ప‌లువురు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో భార‌త క్రికెట్ జ‌ట్టు కొత్త కోచ్ గా ఎవ‌రు ?  వ‌స్తార‌న్న‌ది ఆస‌క్తి గా మారింది. అయితే బీసీసీఐ మాత్రం ద్ర‌విడ్‌కే ఓటేసింది. ఇక ద్ర‌విడ్ తో బీసీసీఐ కాంట్రాక్టు రెండేళ్ల పాటు అమ‌ల్లో ఉంటుంది. ఇందుకు గాను ద్ర‌విడ్‌కు యేడాదికి రు. 10 కోట్ల చొప్పున రెండేళ్ల‌కు గాను రు. 20 కోట్లు చెల్లించ నున్నార‌ట‌. ఇక త్వ‌ర‌లోనే టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతోంది. ఈ పొట్టి ప్ర‌పంచ క‌ప్ ముగిసిన వెంట‌నే తాను కోచ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు ద్ర‌విడ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇక ద్ర‌విడ్ కోచ్ గా ఉండ‌గానే మ‌నం టీం ప‌లు కీల‌క టోర్నీలు ఆడ‌నుంది.

వ‌చ్చే 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ కూడా ద్ర‌విడ్ ఆధ్వ‌ర్యంలోనే భార‌త జ‌ట్టు ఆడ‌నుంది. ఇక ద్ర‌విడ్ క‌ర్నాట‌క జ‌ట్టుకు చెందిన ఆట‌గాడు. రంజీల నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ద్ర‌విడ్ 1997లో ఇంగ్లండ్ లో ప‌ర్య‌టించిన భార‌త జ‌ట్టుతో ఎంట్రీ ఇచ్చాడు. అక్క‌డ గంగూలీ , ద్ర‌విడ్ కెరీర్ ఒకేసారి ప్రారంభ‌మైంది. ఇక 2007 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లో సైతం ద్ర‌విడ్ సార‌థ్యంలోనే భార‌త్ ఆడింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: