భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతే కాదు భారత క్రికెట్ లో ఏ క్రికెటర్ కి సాధ్యం కాని ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదట భారత జట్టులో కీలక ఆటగాడిగా రాణించిన మహేంద్రసింగ్ ధోని ఆ తర్వాత జట్టు బాధ్యతలను స్వీకరించి ఎన్నో మరపురాని విజయాలను కూడా అందించాడు. ఇప్పటికి కూడా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన విజయాలను ఏ కెప్టెన్ కూడా బీట్ చేయలేకపోయాడు అని చెప్పాలి.



 అయితే ఇలా భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోని ఉన్నపళంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియాకు వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు అనుకున్న మహేంద్రసింగ్ ధోని అకస్మాత్తుగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరికీ షాకిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఇటీవలే ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. మరోసారి తన ఫినిషర్ పాత్రను పోషించాడు మహేంద్రసింగ్ ధోని.



 అయితే ధోని మరోసారి ఫామ్ లోకి రావడంతో ఇక ధోని రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండి ఉంటే బాగుండేదని ఎంతోమంది అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు  భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇంకా కొంతకాలం పాటు క్రికెట్ ఆడి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన తీరు ఎంతో మందిని ఆకట్టుకుంది. వారూ ఛాంపియన్ కావడానికి అర్హులు. వీలైతే ధోని మరికొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది అంటూ ఇటీవల ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కె.ఎల్.రాహుల్ తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: