ఈ మ్యాచ్ పై ఏపీలో పలు ప్రాంతాలు, నగరాల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. అయితే గత మ్యాచ్‌ల కంటే భిన్నంగా ఈ సారి బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ రేట్లను పెంచేస్తున్నారు. వికెట్టు వికెట్టుకు, ప్రతీ బౌండ్రీకి, సిక్సర్ కి కూడా ముందు నుంచే బుకీలు బెట్టింగ్ లు వేస్తున్నారు. ఇక టీం ఇండియా జట్టులో ఉండే 11 మందిలో ఎవరెవరు ఉంటారనే దానిపై మరో బెట్టింగ్ కూడా నడుస్తోంది. అటు పాక్ టీం లో కూడా తుది 11 మందిలో ఎవరు ఎవరు ఉంటారనే దానిపై కూడా బెట్టింగ్ నడుస్తోంది.
ఆన్లైన్ మార్కెట్ లో పాక్ పై వెయ్యి కి 2000 బెట్టింగ్ నడుస్తుంటే... అదే ఇండియా పై వెయ్యికి 1300 బెట్టింగ్ కాస్తున్నారు. అదే బయట మార్కెట్లో పాక్ పై వెయ్యికి 4 వేలు, ఇండియా పై వెయ్యికి 2 వేలు చొప్పున పందాలు కాస్తున్నారు. మెదటి బంతి నుంచి చివరి బంతి వరకు ఫలితం మారిపోయే ఈ పొట్టి క్రికెట్లో బెట్టింగ్ రాయుళ్లు ప్రతి బంతికి బెట్టింగ్ వేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ మాఫియా పై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరో వైపు యువత ఈ బెట్టింగ్ వలలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.