ఈ 55 పరుగులు టీ 20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జట్టుగా విండీస్ నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే టీ 20 వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్లు రెండుసార్లు నమోదు చేసిన జట్టు నెదర్లాండ్స్. విచిత్రం ఏంటంటే ఆ జట్టు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన రెండు సార్లు కూడా ప్రత్యర్థి జట్టు శ్రీలంకే కావడం గమనార్భం. 2014 టి 20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ జట్టు 39 పరుగులకే పెవిలియన్ కు చేరుకుంది.
ఇక టీ 20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 42 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్ కూడా శ్రీలంక పైనే 2014 టీ 20 వరల్డ్ కప్‌లో 60 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉంది. ఇక విండీస్ టీ 20 ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది నాలుగో సారి. అందులో మూడు సార్లు ఇంగ్లండ్ పైనే కావడం మరో విశేషం.