
* మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఒక మంచి ఇన్ స్వింగర్ యార్కర్ ను అంచనా వేయలేక రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికి పోయాడు. మొదటి ఆరు ఓవర్లు బ్యాట్స్ మన్ కు చుక్కలు కనిపించాయి. అయితే ఆచితూచి ఆడకుండా రాహుల్ కూడా క్లిన్ బౌల్డ్ అయ్యాడు.
* పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న సమయంలో బ్యాటింగ్ నెమ్మదిగా చేయాల్సింది. కానీ పిచ్ ను అంచనా వేయలేక మూడు కీలక వికెట్లు కోల్పోయింది ఇండియా. మరో వైపు కోహ్లీతో జత కలిసిన పంత్ ఎప్పటిలాగే రెండు సిక్సర్ లు బాది అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కనీసం 15 ఓవర్ల వరకు మరో వికెట్ పడకుండా ఆడి ఉంటే ఇంకో 20 నుండి 30 పరుగులు సాధించే అవకాశం ఉండేది.
* ఇక జడేజా కన్నా ముందు హార్దిక్ ను పంపి ఉంటే అతను కుదురుకోవడానికి సమయం ఉండేది. తన హిట్టింగ్ స్కిల్స్ ఉపయోగపడేవి. కానీ జడేజా రావడంతో ఆ సమయం అంత వేస్ట్ అయింది. ఇక హార్దిక్ వచ్చే లోగా 2 ఓవర్లు ఉన్నాయి. ఎప్పటిలాగే ఒకటి రెండు షాట్ లకే పరిమితం అయ్యి పెవిలియన్ చేరాడు.
* ఇక ఆ తర్వాత బౌలర్లు ఒక్క షాట్ సరిగా ఆడలేక 151 పరుగులకు పరిమితం అయింది, టీమిండియా బౌలర్ లలో శార్దూల్ ఠాకూర్ ఉండి ఉంటే తన అల్ రౌండ్ ప్రతిభ యూజ్ అయ్యేది.
* అయితే 152 పరుగుల లక్ష్యం ఏమంత సులభం కాదు. మొదటి పవర్ ప్లే లో వికెట్లు తీస్తే పాకిస్తాన్ పై ఒత్తిడి పెరిగేది. కానీ మనకున్న బౌలర్లు కనీసం ఒక్క వికెట్ తీయలేకపోయారు. క్రీజులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడారు.
* ఇప్పుడు అయినా సెలెక్టర్లు ఒక విషయం గుర్తించుకోవాలి. టీ 20 లలో జట్టులో ఎక్కువ మంది అల్ రౌండర్ లు ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ జట్టులో శార్దూల్ ఠాకూర్ ఉంటే బౌలింగ్ బ్యాటింగ్ లో ఉపయోగపడి ఉండొచ్చు. హార్దిక్ ఇంకా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు అనిపించింది. ఎంతో అనుభవం ఉన్న అశ్విన్ తుది జట్టులో ఉండుంటే బాగుండేది.
అయితే ఈ జట్టు కూర్పులో పూర్తిగా కోహ్లీ మరియు రవిశాస్త్రి నిర్ణయమని తెలుస్తోంది. జట్టు మెంటార్ గా ఉన్న ధోని సలహాలు తీసుకున్నారో లేదో తెలియదు. మరి ముందు మ్యాచ్ లలో అయినా ఈ తప్పులను సరిదిద్దుకుని సెమీఫైనల్ లో స్థానాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.