టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమిండియా వరుసగా రెండు ఘోర పరాజయాలను చవి చూడటం మాత్రం ఇప్పటికి కూడా భారత ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుసగా రెండు ఓటమిలు చవిచూసిన టీమిండియా సెమీస్ అవకాశాలను చేజార్చుకోవడం తో ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలుస్తుంది అని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు.


 కానీ కనీసం సెమీస్లో కూడా అడుగు పెట్టలేకపోయింది టీమిండియా జట్టు. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న టీమిండియా జరగబోయే మ్యాచ్ లలో మాత్రం గెలవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే పరువు నిలబెట్టుకోవాలంటే టీమిండియా భారీ విజయాలు సాధించాలి. అయితే రెండో మ్యాచ్ లో  జట్టులో పలు మార్పులు చేసి కోహ్లీసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అనే విషయం తెలిసిందే. అంతే కాదు టీమిండియా జట్టులో ఏ ఆటగాడు కూడా అంచనాలకు తగ్గట్లుగా రాణించడం లేదు. ముఖ్యంగా టీమిండియా లో కీలక ఆటగాళ్లు గా ఉన్న హార్దిక్ పాండ్య పేసర్ భువనేశ్వర్ కుమార్ లు కూడా వరుసగా విఫలమవుతున్నారు.



 అయితే ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ లో వీరిద్దరిని కొనసాగినప్పటికీ..  టి20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్తో జరగబోయే టి20 టెస్ట్ సిరీస్ లకు మాత్రం వీరిద్దరిని ఎంపిక చేసే అవకాశం తక్కువగానే ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. అయితే వీరిద్దరి పై వేటు వేయడానికి మరో కారణం కూడా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. 2022 లో జరగబోయే ప్రపంచ కప్ కి దాదాపుగా 11 నెలల సమయం ఉంది. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పూర్తిగా విఫలం కావడంతో అటు బీసీసీఐ రాబోయే వరల్డ్ కప్ ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జట్టులోకి వీలైనంత ఎక్కువమంది కొత్త ఆటగాళ్లను తీసుకురావాలని భావిస్తోందట.


 ఇలా కొత్త ఆటగాళ్లతో ప్రయోగాలు చేసి.. యువ ఆటగాళ్ల లోని ప్రతిభను వెలికి తీసి జుట్టును మరింత పటిష్టంగా మార్చుకునేందుకు బీసీసీఐ సెలెక్టర్స్ సిద్ధమయ్యారు అన్నది తెలుస్తుంది. అదే సమయంలో గత కొంత కాలం నుంచి ఎలాంటి విరామం లేకుండా ఆడుతున్నా జస్ప్రిత్ బూమ్రా, షమీలకు  కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఐపీఎల్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ లను న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: