అయితే ఇక మొదట బ్యాటింగ్ చేసిన ప్పటికీ పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు అనే చెప్పాలి.. ఏకంగా 177 పరుగులు చేశారు. దీంతోఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు ముందు భారీ లక్ష్యం ఉంది. అయితే ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్మెన్ లు అద్భుతంగా రాణిస్తారు అనుకున్నప్పటికీ మొదటి ఓవర్లోనే ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పుంజుకుని అద్భుతంగా రాణించాడు. కానీ మరో వైపు నుంచి ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందా లేదా అన్న అనుమానం అందరిలో ఎక్కువైంది.. మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది.
ఇక ఒకానొక సమయంలో మొదటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్లో కూడా విజయం సాధిస్తుంది ఏమో అన్న విధంగానే మారిపోయింది పరిస్థితి.కానీ ఆ తర్వాత వచ్చిన మాత్త్యూ వెడ్ అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయాన్ని అందుకొని ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే టి20 వరల్డ్ కప్లో పాకిస్థాన్కు ఆస్ట్రేలియా ఎప్పటినుంచో చెక్ పెడుతూ వస్తుంది. 2010లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత సెమీస్లో కూడా ఆసీస్ జట్టు గెలిచింది. 2010లో పాకిస్థాన్ జట్టు 191 పరుగులు చేయగా ఆసీస్ విజయానికి చివరి 5 ఓవర్లలో 70 కావాల్సి వచ్చింది. అప్పుడు మైకేల్ హస్సీ అద్భుతంగా రాణించి 24 బంతుల్లో 60పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించాడు ఇటీవల నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా మాత్త్యూ వెడ్ బౌండరీ లతో విజృంభించి జట్టుకు విజయాన్ని అందించాడు..