
ఈ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి సారథ్య బాధ్యతను తీసుకున్నాడు. మొదటి టెస్ట్ లో విఫలం అయిన రహానేపై కోచ్ వేటు వేశారు. అయితే అధికారిక సమాచార ప్రకారం గాయం కారణంగా తుది జట్టు నుండి తప్పించినట్లు టీమ్ యాజమాన్యం తెలిపింది. కానీ వాస్తవం అది కాదని... మొదటి టెస్ట్ లో విఫలం కావడమే ప్రధాన కారణమని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇదే నిజమని తెలుస్తోంది. ఎందుకంటే కోహ్లీ జట్టులోకి రావడంతో ఎవరిని తప్పించాలి అన్న ప్రశ్నకు రహానే విఫలం కావడం ప్లస్ అయింది.
పైగా గత టెస్ట్ లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ మరియు అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాబట్టి తప్పక రహానేను మాత్రమే తప్పించాలి. అందుకే గాయం పేరు చెప్పి రహనేను తప్పించారు. ఇప్పుడు భారత్ జట్టులో పోటీ ఎక్కువగా ఉంది. ఆటతీరు బాగా లేకపోతే ఎవరైనా జట్టులో చోటు కోల్పోవడం ఖచ్చితం. మరి ముందు ముందు రహానే తన ఆటతీరును మార్చుకుని కుర్రాళ్లకు పోటీ ఇవ్వగలడా అన్నది చూడాలి.